టీ మంత్రుల తెగువ

4 April 2014

- తెలంగాణపై సీఎం తీరుకు నిరసనగా..
-
టీ మంత్రులకు దిగ్విజయ్ ఫోన్
-
భేటీకి వెళ్లాలని సూచన.. వెళ్లలేమన్న మంత్రులు
-
కిరణ్ ఏకపక్ష ధోరణియే కారణమని వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (టీ మీడియా): తెలంగాణ మంత్రులు మరోసారి తెగువ చూపారు. తెలంగాణ ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుపడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై నిరసన వ్యక్తంచేస్తూ కేబినెట్ సమావేశాన్ని బహిష్కరించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి తెలంగాణ మంత్రులు దూరంగా ఉన్నారు. కేబినెట్ సమావేశానికి హాజరుకావాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ టీ మంత్రులకు ఫోన్ చేసి.. కోరినా వారు నిరాకరించినట్టు తెలిసింది.
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి దిగ్విజయ్ ఫోన్ చేసి .. కేబినెట్ భేటీకి వెళ్లాలని సూచించారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా టీ మంత్రులకు ఫోన్ చేసి కేబినేట్ సమావేశానికి రావాల్సిందిగా కోరారు. అయితే తెలంగాణ ఏర్పాటు విషయంలో సీఎం కిరణ్ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని ధిక్కరించడమే కాకుండా.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఆయన తీరుకు నిరసనగా తాము సమావేశానికి వెళ్లబోమని వారు తేల్చిచెప్పారు. దీంతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీహాల్లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సీమాంధ్ర మంత్రులతోనే కేబినెట్ సమావేశం జరిగింది. సమయంలో టీ మంత్రులు సీనియర్ మంత్రి కుందూరు జానారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు.
భేటీలో జానారెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్, బస్వరాజు సారయ్య, రామిరెడ్డి వెంకట్‌రెడ్డి సునీతాలకా్ష్మరెడ్డితోపాటు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. జానారెడ్డి నివాసం నుంచి నేరుగా శాసనసభా ప్రారంభ సమయానికి టీ మంత్రులు అసెంబ్లీకి వచ్చారు. తెలంగాణ విషయంలో అంటీముట్టనట్లుగా


http://www.casino.us.org/